logo

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ  పథకంలో చేపట్టిన పనులపై మూడో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు.

Published : 02 Jul 2024 06:03 IST

పాలకుర్తి, న్యూస్‌టుడే: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ  పథకంలో చేపట్టిన పనులపై మూడో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీవో రవీందర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించారు. 2023 ఏప్రిల్‌1 నుంచి 2024 మార్చి 31 వరకు మండలంలోని 20 గ్రామాల్లో చేపట్టిన వివిధ పనులపై నివేదికలను చదివి వినిపించారు. మండలంలో మొత్తం రూ.3,20,04,299 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు వేతనాలుగా రూ.3,09,86,582 కోట్లు, రూ.10,17,717 లక్షలు సామగ్రి చెల్లింపులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులపై తనిఖీ నిర్వహించగా ఉపాధి హామీ సిబ్బంది పని ప్రదేశంలో కూలీల మస్టర్లపై సంబంధిత అధికారులు రోల్‌కాల్‌ చేయకపోవడం, కొలతల్లో తేడాలు, మస్టర్లలో కూలీల సంతకాలు, హాజరు లేకుండా వేతనాల చెల్లింపులు, మస్టర్ల హాజరు గణన లెక్కింపులో తప్పిదాలు, పని ప్రదేశం తేడాలు వంటి తప్పిదాలపై మండలంలోని 20 గ్రామాలకు గాను రూ.10,065 రికవరీకి ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవీవో కొమురయ్య, ఏడీవీవో గణేష్, ఈజీఎస్‌ అంబుడ్స్‌ మెన్‌ శరత్, ఏపీడీ సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, ఎంపీడీవో శశికళ, ఎంపీవో షబ్బీర్‌ పాషా, ఏపీవో కొమురయ్య, ఎస్‌టీఎం వేణు, ఎస్సార్పీ మహేశ్వర్, సామాజిక తనిఖీ బృందం సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని