logo

రాజన్న ఆలయ ఈవోగా వినోద్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఇన్‌ఛార్జి ఈవోగా వినోద్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్‌ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో రామకృష్ణ గత నెల 30 వరకు అదనపు బాధ్యతలు నిర్వహించారు.

Published : 02 Jul 2024 05:53 IST

వేములవాడ, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఇన్‌ఛార్జి ఈవోగా వినోద్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్‌ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో రామకృష్ణ గత నెల 30 వరకు అదనపు బాధ్యతలు నిర్వహించారు. కృష్ణప్రసాద్‌ తన సెలవును పొడిగించడంతో వినోద్‌రెడ్డిని ఇన్‌ఛార్జి ఈవోగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆయన వేములవాడ చేరుకొని ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ మండపంలో ఆయనకు ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఏఈవో శ్రీనివాస్‌ సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, ఏఈవోలు హరికిషన్, ప్రతాప నవీన్, పర్యవేక్షకులు తిరుపతిరావు, నటరాజ్, మహేశ్, ప్రొటోకాల్‌ పర్యవేక్షకుడు శ్రీరాములు, ఈవో సీసీ శివ, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని