logo

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Published : 02 Jul 2024 05:46 IST

సిరిసిల్ల కలెక్టరేట్, న్యూస్‌టుడే: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జులై 1 నుంచి 31 వరకు నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌లో పోలీస్‌ అధికారులు, ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, కార్మిక, విద్య, వైద్య శాఖలతోపాటు వివిధ డిపార్ట్‌మెంట్‌ల అధికారులు, సిబ్బందితో జిల్లాలో రెండు టీంలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ టీంలు సమన్వయంతో విధులు నిర్వర్తించి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు కృషి చేస్తాయన్నారు.  18 సంవత్సరాల లోపు  బాలలు షాపులు, హోటళ్లలో పని చేస్తున్నవారిని, గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. లేకుంటే స్టేట్‌ హోమ్‌కు తరలిస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైన బాలకార్మికులు కనిపిస్తే 1098, డయల్‌ 100కు గానీ, పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని