logo

సాగు అంతంతే

ఉమ్మడి జిల్లాలో తొలుత వర్షంకురవటం మధ్యలో విరామం అనంతరం మళ్లీ వర్షాలు కురుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం వెనుకంజలోనే ఉంది.

Published : 30 Jun 2024 03:34 IST

వ్యవసాయ శాఖ తాజా నివేదికలో వెల్లడి

జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో తొలుత వర్షంకురవటం మధ్యలో విరామం అనంతరం మళ్లీ వర్షాలు కురుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం వెనుకంజలోనే ఉంది. వ్యవసాయశాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కరీంనగర్‌ జిల్లాలో సాధారణంకన్నా కాస్తా అధిక వర్షపాతం నమోదుకాగా జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల్లేక ప్రాజెక్టుల్లోనూ నీటిమట్టం అడుగంటి ఇప్పట్లో నీటిని ఆయకట్టుకు వదిలే పరిస్థితిలేదు. వరి ప్రధాన పంటకాగా భూగర్భ జలాలను వినియోగించుకుని పంపుసెట్ల ఆధారితంగా ప్రస్తుతం రైతులు పెద్దఎత్తున వరినార్లు పోస్తున్నారు. ప్రస్తుతం వరినార్లు పోసినా మరో పక్షం రోజులవరకు భారీ వర్షాల్లేకుంటే వరినాట్లకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఆసరాగా చేసుకుని పసుపు, పత్తి, మక్క, పెసర, మినుము, సోయాబీన్, కంది తదితర పంటలను విత్తుకోవచ్చని, పత్తిలో విత్తనాలు మొలవని చోట పోగుడ్డలు పెట్టవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నిరుడు జిల్లాలో అధిక వర్షపాతం నమోదుకాగా ఈ వానాకాలంలో సాధారణం వర్షపాతం ఉండవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొనటం రైతులకు ఆశలు కలిగిస్తున్నా మున్ముందు కురిసే వర్షాలపైనే పైర్ల సాగువిస్తీర్ణం పూర్తిగా ఆధారపడి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని