logo

భూ నిర్వాసితులకు చట్టబద్ధమైన పరిహారం

జిల్లాలో నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చట్టబద్ధమైన పరిహారం చెల్లించనున్నట్లు అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ తెలిపారు.

Published : 30 Jun 2024 03:32 IST

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌

పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చట్టబద్ధమైన పరిహారం చెల్లించనున్నట్లు అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ తెలిపారు. సమీకృత పాలనా ప్రాంగణంలో శనివారం భూ నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతుల దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని వెల్లడించారు. భూముల్లో ఇళ్లు, బావులు, చెట్లు, మోటార్లు, పైపులైన్లు తదితర ఆస్తులకు సంబంధించి అంచనాలు రూపొందించి పరిహారం చెల్లిస్తామన్నారు. రహదారి అలైన్‌మెంట్‌ కేంద్ర పరిధిలోని సంస్థ నిర్ణయిస్తుందన్నారు. మంథని ఆర్డీవో హనుమానాయక్, అధికారులు పాల్గొన్నారు.

ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు

జిల్లాలో పెండింగ్‌ ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సూచించారు. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లతో శనివారం ఆయన దూరదృశ్య మాధ్యమంలో సమీక్షించారు. అందుబాటులోని రికార్డులను పరిశీలించాలని సూచించారు. పాలనా ప్రాంగణంలో అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ పాల్గొని జిల్లాలోని ధరణి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని వివరించారు.

మెరుగైన వసతులతో మినీ ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ

పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌ను శనివారం అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ సందర్శించారు. సందర్శకులు, వాకర్స్‌కు ఇబ్బందులు లేకుండా సుందరీకరణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రత కోసం డస్ట్‌బిన్, మూత్రశాలలు, ఇతర పనులను పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్, మేనేజర్‌ శివప్రసాద్, ఏఈ సతీశ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని