logo

బల్దియా జాగాపై ప్రైవేటు జబర్దస్తీ!

జీహెచ్‌ఎంసీ ఆస్తులతో ప్రైవేటు వ్యక్తులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అక్రమ ప్రకటనల బోర్డుల ఏర్పాటుతోరూ.లక్షల్లో అద్దె వసూలు చేసుకుంటున్నారు.

Published : 05 Jul 2024 02:46 IST

అక్రమ ప్రకటనలతో రూ.కోట్ల ఆర్జన
హిమాయత్‌నగర్‌లో ఒకే రోజు వంద బోర్డులు

హిమయత్‌నగర్‌ రోడ్డు విభాగినిపై వెలిసిన ప్రకటనల బోర్డులు 

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఆస్తులతో ప్రైవేటు వ్యక్తులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అక్రమ ప్రకటనల బోర్డుల ఏర్పాటుతోరూ.లక్షల్లో అద్దె వసూలు చేసుకుంటున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు ఏజెన్సీ రాత్రికి రాత్రి హిమయత్‌నగర్‌ రోడ్డు పొడవునా వంద బోర్డులను ఏర్పాటుచేయడమే అందుకు నిదర్శనం. అధికారులు వాటిని తొలగించకూడదన్న ఉద్దేశంతో.. మేయర్‌ విజయలక్ష్మి ఫొటోలతో వాటిపై ప్రకటనలు వేయడం గమనార్హం.  ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు.

ఇవిగో ఉదాహరణలు..

  • నారాయణగూడ పైవంతెన నుంచి మినర్వా హోటల్‌ వరకు ఆదివారం రాత్రి 100 లాలిపప్‌ ప్రకటనల బోర్డులు వెలిశాయి. వాటిపై అధికారులను వివరణ కోరితే.. అక్రమంగా ఏర్పాటుచేసిన విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు.  
  • ఐమాక్స్‌ రోడ్డు, జూబ్లీహిల్స్‌  రోడ్డులో ప్రకటనల బోర్డులు వందల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన కోర్టు కేసులో అధికారులు సరైన వాదనలు వినిపించడం లేదన్న ఆరోపణలున్నాయి.  

నిషేధం అందుకేనా.. : హోర్డింగులు, విభాగినులు, రోడ్లకు ఇరువైపులా ప్రమాదాలకు తావిచ్చే ఆయా ప్రకటనలను జీహెచ్‌ఎంసీ నిషేధించింది. దీంతో నగరవ్యాప్తంగా 1,500కుపైగా హోర్డింగులు ఖాళీ అయ్యాయి. అవినీతి అధికారుల అండదండలతో అనధికార హోర్డింగులు, బోర్డులు, ఇతర రకాల ప్రకటనలు పుట్టుకొస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని