logo

కొణిజేటి రోశయ్యకు భారతరత్న ప్రకటించాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య చెరగని ముద్రవేశారని టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కోకన్వీనర్, ఐవీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్త కొనియాడారు.

Published : 05 Jul 2024 02:35 IST

రోశయ్య విగ్రహానికి పూలమాల వేస్తున్న ఉప్పల శ్రీనివాస్‌గుప్త. చిత్రంలో కృష్ణమూర్తి, రాజమౌళిగుప్త, రాజశేఖర్‌గుప్త తదితరులు

ముషీరాబాద్, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య చెరగని ముద్రవేశారని టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కోకన్వీనర్, ఐవీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్త కొనియాడారు. ఆయన 91వ జయంతి వేడుకలను గురువారం ముషీరాబాద్‌లోని వాసవి ఆర్యవైశ్య హాస్టల్‌ ట్రస్టు భవనంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉప్పల శ్రీనివాస్‌గుప్త మాట్లాడుతూ, రోశయ్య తన రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులు చేపట్టడంతోపాటు వాటికి వన్నెతెచ్చిన మహనీయుడన్నారు.  ముషీరాబాద్‌ ఆర్యవైశ్య హాస్టల్‌ ట్రస్టు ఛైర్మన్, ఇంటర్నేషల్‌ వైశ్య ఫెడరేషన్‌ అడ్వయిజరీ బోర్డు సెంట్రల్‌ కమిటీ ఛైర్మన్‌ గంజి రాజమౌళిగుప్త కోరారు. ప్రభాకర్‌గుప్త, ముత్యాల సత్తయ్య, రాజశేఖర్‌గుప్త, కృష్ణమూర్తి, శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని