logo

చంద్రబాబుకు స్వాగత ఫ్లెక్సీలు

ఆంధ్ర]ప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలుకుతూ తెదేపా శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేశారు.

Updated : 05 Jul 2024 05:43 IST

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలుకుతూ తెదేపా శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేశారు. తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరామ్‌ చందర్‌ ఆధ్వర్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మొదలుకొని జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం వరకు భారీగా ఫ్లెక్సీలు పెట్టారు. ‘నిజం గెలిచింది’ అంటూ ఫ్లెక్సీలను పెట్టారు. శుక్రవారం చంద్రబాబు నగరానికి వస్తుండటంతో బేగంపేట విమానాశ్రయం నుంచి ఇంటి వరకు స్వాగతం పలికేందుకు ప్రత్యేకఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం సాయంత్రం తరలిరావాలని తెలంగాణ తెదేపా సీనియర్‌ నేత, వెంగళ్‌రావునగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు మల్లికార్జున నాయుడు పిలుపునిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని