logo

పార్లమెంటు ప్రాంగణంలో అల్లూరి విగ్రహం

సమ సమాజ నిర్మాణాన్ని కాంక్షించడం సహా భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర మంత్రి సీతక్క కొనియాడారు.

Updated : 05 Jul 2024 05:49 IST

అల్లూరికి నివాళి అర్పిస్తున్న మంత్రి సీతక్క తదితరులు 

రాంనగర్, న్యూస్‌టుడే: సమ సమాజ నిర్మాణాన్ని కాంక్షించడం సహా భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర మంత్రి సీతక్క కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకొని గురువారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్లమెంటు ప్రాంగణంలో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలన్నారు. అనంతరం క్షత్రియ సేవా సమితి సభ్యులను ఆమెను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరొషన్‌ ఛైర్మన్‌ పటేల్‌రమేశ్‌రెడ్డి, ఏపీ మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆ పాత్ర ప్రభాస్‌కు బాగుంటుంది: శ్యామలాదేవి

అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు పాత్రను సినీ నటుడు ప్రభాస్‌ చేస్తే ఆయన మళ్లీ పుట్టినట్లు ఉంటుందని ఆమె అన్నారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో పెట్టించేలా తన భర్త కృష్ణంరాజు గతంలో ప్రయత్నించారని ఆమె చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని