logo

దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటుకు కృషి

రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం రాజధానిలో ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 05 Jul 2024 02:25 IST

ప్రసంగిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిత్రంలో కురుమ సంఘం నాయకులు 

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం రాజధానిలో ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి విగ్రహం ఏర్పాటుకు కృషిచేస్తానన్నారు. గురువారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. నిరంకుశ, నియంతృత్వ పాలనకు ఎదురు నిలబడి అమరుడైన దొడ్డి కొమురయ్య ఆదర్శజీవి అని కొనియాడారు. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేష్, కురుమ సంఘం నేతలు శీర సురేష్, కె.మల్లేషం, రాజ్‌కుమార్, మహిళా నేతలు బాలమణి, సుగుణ, శ్యామల తదితరులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని