logo

కన్నతల్లిని కడతేర్చి.. సాధారణ మృతిగా చిత్రీకరించి..

దైవదర్శనానికి వచ్చిన సందర్భంలో తల్లి అస్వస్థతకు గురికాగా అసహనానికి గురైన కుమారుడు ఆమెను హత్య చేశాడు. ఆమెది సహజ మరణమని చెబుతూ తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు.

Updated : 05 Jul 2024 05:50 IST

వర్గల్, న్యూస్‌టుడే: దైవదర్శనానికి వచ్చిన సందర్భంలో తల్లి అస్వస్థతకు గురికాగా అసహనానికి గురైన కుమారుడు ఆమెను హత్య చేశాడు. ఆమెది సహజ మరణమని చెబుతూ తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంగుట్టలో జరిగింది. గౌరారం ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపిన వివరాలు.. కుత్బుల్లాపూర్‌లోని ఇందిరానగర్‌లో నివసిస్తున్న గాలిగం బాలకృష్ణమ్మ(54) ఖైరతాబాద్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, ప్లానింగ్‌ విభాగంలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఆమె.. కొడుకు సర్వేశ్, పక్కింటివారితో కలిసి ఆటోలో నాచగిరి నృసింహస్వామి క్షేత్రానికి వచ్చింది. స్వామిని దర్శించుకుని రాత్రి సత్రంలో బస చేశారు. అర్ధరాత్రి తర్వాత బాలకృష్ణమ్మ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. అసహనంతో కొడుకు.. తల్లి తలను నేలకేసి బాదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తల్లి అస్వస్థతకు గురై మృతిచెందిందని సర్వేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలకృష్ణమ్మ కుమార్తె సుజాత అక్కడికి వచ్చి చూసి అనుమానంతో పక్కింటివారికి ఫోన్‌ చేసి ఏం జరిగిందో తెలుసుకోగా హత్య చేసిన అసలు విషయం వెల్లడైంది. సోదరి ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని