logo

శంకుస్థాపనతో సరి.. నిర్మాణం ఎప్పుడో మరి!

తాండూరు పట్టణంలో ఆటోనగర్‌ నిర్మాణానికి 2023 అక్టోబరులో అప్పటి ప్రభుత్వం రూ.12.6 కోట్లు మంజూరు చేసింది. అంతారం గుట్ట సమీపంలో స్థలాన్ని కేటాయించి, పనులకు శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదు.

Published : 05 Jul 2024 02:16 IST

తాండూరులో రహదారిపై ఆగిన లారీలు  

న్యూస్‌టుడే, తాండూరు: తాండూరు పట్టణంలో ఆటోనగర్‌ నిర్మాణానికి 2023 అక్టోబరులో అప్పటి ప్రభుత్వం రూ.12.6 కోట్లు మంజూరు చేసింది. అంతారం గుట్ట సమీపంలో స్థలాన్ని కేటాయించి, పనులకు శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. తాండూరుకు ఖనిజాల ఖిల్లాగా పేరుంది. తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో నాపరాళ్లు, సున్నపు రాయి గనులున్నాయి. సున్నపు రాయి ఆధారంగా సిమెంటును ఉత్పత్తి చేసే మూడు ప్రధాన కర్మాగారాలు, ముడి నాపరాయిని నునుపుగా మార్చే 800 యూనిట్లు ఉన్నాయి. పెద్దేముల్‌ మండలంలో సుద్దగనులున్నాయి. ముడి సుద్దతో ఉత్పత్తి జరిగే గ్రాన్యువల్స్‌ను తయారు చేసే పరిశ్రమలున్నాయి. నాపరాయి, సిమెంటు, ముడి సుద్దను దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసే భారీ వాహనాలు వేలల్లో తాండూరు మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. వీటిని పట్టణంలోని  ప్రధాన రహదారులకు ఇరువైపులా నిలుపుతున్నారు. ఆటోనగర్‌ నిర్మాణం పూర్తయితే పట్టణ వాసులకు ఎంతో వెసులు బాటు కలుగుతుంది. లారీల పార్కింగ్‌కు వసతులు కల్పిస్తారు. వాహనాల మరమ్మతుకు సంబంధించి మెకానిక్‌లకు షెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని