logo

రయ్‌మంటూ దూసుకెళ్తే.. లైసెన్స్‌ రద్దే

బైక్, కారుతో రోడ్డుపైకి వచ్చి ఇష్టారాజ్యం డ్రైవింగ్‌ చేశారంటే..చిక్కుల్లో పడ్డట్టే. ర్యాష్‌ డ్రైవింగ్‌పై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారిస్తోంది.

Published : 05 Jul 2024 02:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: బైక్, కారుతో రోడ్డుపైకి వచ్చి ఇష్టారాజ్యం డ్రైవింగ్‌ చేశారంటే..చిక్కుల్లో పడ్డట్టే. ర్యాష్‌ డ్రైవింగ్‌పై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారి లైసెన్సులు సస్పెండ్‌ చేస్తోంది. గతేడాదిలో అన్ని ప్రాంతాలు కలిపి 150 వరకు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన వాహనదారుల లైసెన్సులను సస్పెండ్‌ చేయగా...అందులో 33 మంది నగరానికి చెందిన వారే ఉన్నారు. 3నెలల నుంచి 6నెలల వరకు లైసెన్సులు రద్దు చేస్తున్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో సైతం...: తాగి వాహనం నడిపిన వారిపై కూడా ఆర్టీఏ దృష్టి సారించింది. ఇలాంటి వారి లైసెన్సులను సైతం సస్పెండ్‌ చేస్తోంది. ఏడాది కాలంలో హైదరాబాద్‌ పరిధిలో 225 మంది లైసెన్సులను రద్దు చేసింది.  చదువు, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఇక్కడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే వారి లైసెన్సులు రద్దు కావడం వల్ల ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకోవడం కష్టమవుతుం హైదరాబాద్‌ జేటీసీ రమేష్‌ సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని