logo

పారిశుద్ధ్య కార్మికులకు మూడుసార్లు హాజరు

నగరంలో పారిశుద్ధ్య  కార్మికుల నుంచి ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు తీసుకునేలా జీహెచ్‌ఎంసీ నిబంధన తీసుకొచ్చింది.

Published : 05 Jul 2024 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పారిశుద్ధ్య  కార్మికుల నుంచి ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు తీసుకునేలా జీహెచ్‌ఎంసీ నిబంధన తీసుకొచ్చింది. కొందరు ఎస్‌ఎఫ్‌ఏ(శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌)లు నకిలీ కార్మికులతో జీతాలను కొల్లగొడుతున్న ఘటనలు వెలుగులోకి రావడంతో.. కొత్త నిబంధన తీసుకొచ్చామని ఐటీ విభాగం గురువారం ప్రకటించింది. ఇప్పటికే వేలి ముద్రలతో హాజరు తీసుకునే పాత పద్ధతిని రద్దుచేసి, ముఖాన్ని స్కానింగ్‌ చేసే విధానం ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు.కొందరు సూపర్‌వైజర్లు, సహాయ వైద్యాధికారులు ముఖాన్ని స్కాన్‌చేసే సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను కూడా సొమ్ము చేసుకుంటున్న ఉదంతాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. అనంతరం సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను పరిష్కరించారు. మరింత జాగ్రత్త కోసం.. ‘మొత్తం 18వేల మంది పారిశుద్ధ్య కార్మికులు.. ఏడుగురు చొప్పున గ్రూపులుగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఒక్కో గ్రూపులో రోజూ ఐదు నుంచి ఆరుగురు ఉంటారు. అందులోని ఇద్దరి నుంచి ఉదయం, మధ్యాహ్నంతో పాటు మధ్యలో 10గంటల సమయంలోనూ హాజరు తీసుకునేలా నిబంధన తీసుకొచ్చాం. దీంతో ఉదయం, మధ్యాహ్నం హాజరు తీసుకుని ఇంటికి వెళ్లిపోయే కార్మికులను కట్టడి చేయగలం’’ అని అధికారులు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని