logo

నిమ్స్‌ డైరెక్టర్‌ పేరుతో సైబర్‌ నేరస్థుల గాలం

సైబర్‌ నేరస్థులు నిమ్స్‌ డైరెక్టర్‌ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆస్పత్రి డైరెక్టర్‌ నగరి బీరప్ప పేరుతో సైబర్‌ నేరస్థులు ఆస్పత్రి ఉద్యోగులు, నగరంలోని కొందరికి వాట్సప్‌ ద్వారా సందేశాలు పంపించారు.

Published : 05 Jul 2024 02:03 IST

నిమ్స్, న్యూస్‌టుడే: సైబర్‌ నేరస్థులు నిమ్స్‌ డైరెక్టర్‌ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆస్పత్రి డైరెక్టర్‌ నగరి బీరప్ప పేరుతో సైబర్‌ నేరస్థులు ఆస్పత్రి ఉద్యోగులు, నగరంలోని కొందరికి వాట్సప్‌ ద్వారా సందేశాలు పంపించారు. ఇది డైరెక్టర్‌ దృష్టికి రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.  తన వాట్సాప్‌ స్టేటస్‌లో తన పేరుతో సైబర్‌ నేరస్థులు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎవరూ స్పందించొద్దని సూచించారు. +94 770895491 నంబర్‌తో ఆ వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపిస్తున్నట్లు అప్రమత్తం చేశారు. ప్రొఫైల్‌కి డైరెక్టర్‌ చిత్రాన్ని జోడించారు. ఆ నంబర్‌ ద్వారా డబ్బు కావాలంటూ సందేశాలు పంపించడం వైరల్‌ అయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని