logo

రైలు ఢీకొని.. స్టేషన్‌ వరకు ఈడ్చుకొని

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో రైలు ఇంజిన్‌కు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని కొందరూ ప్రయాణికులు సామాజిక మాధ్యమంలో బుధవారం పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది.

Updated : 04 Jul 2024 04:35 IST

వేలాడుతున్న మృతదేహం

ఘట్‌కేసర్, రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో రైలు ఇంజిన్‌కు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని కొందరూ ప్రయాణికులు సామాజిక మాధ్యమంలో బుధవారం పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. మంగళవారం సాయంత్రం వరంగల్‌ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ప్యాసింజర్‌ రైలు యాదాద్రి జిల్లా బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన ఎర్ర ఫకీర్‌(60)ను ఢీకొట్టింది. చనిపోయినా ఇంజిన్‌ కొనకు వేలాడుతూనే ఉన్నాడు. అలాగే రైలు ఘట్‌కేసర్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఆ దృశ్యాన్ని రైల్వే గేటు వద్ద ఉన్న వాహనాదారులు చిత్రీకరించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘట్‌కేసర్‌-చర్లపల్లి మధ్య రైలు ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలోని శవాగారానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని