logo

తెరుచుకున్న గుండ్లమడుగు తండా పాఠశాల

తాండూరు మండలం గుండ్లమడుగు తండా పాఠశాల ఎట్టకేలకు తెరుచు కుంది.‘ఈనాడు’లో..‘20 రోజులుగా పాఠశాల మూత’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య స్పందించారు.

Published : 04 Jul 2024 01:40 IST

దస్త్రాలు పరిశీలిస్తున్న విద్యాధికారి వెంకటయ్య 

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తాండూరు మండలం గుండ్లమడుగు తండా పాఠశాల ఎట్టకేలకు తెరుచు కుంది.‘ఈనాడు’లో..‘20 రోజులుగా పాఠశాల మూత’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య స్పందించారు. పాఠశాల సముదాయ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు వైద్యనాథ్‌తో కలిసి పాఠశాలకు వెళ్లి తెరిపించారు. ఇక్కడి ఉపాధ్యాయులు నారాయణ్‌రెడ్డి అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లడంతో తాత్కాలికంగా ఉపాధ్యాయుడు సతీష్‌ను విధులకు నియమించామన్నారు. సతీష్‌ విధులకు గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తాజాగా ఆయన స్థానంలో ఉద్దండాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పండరిని డిప్యూటేషన్‌పై విధులకు నియమించారు. సెలవుపై వెళ్లిన ఉపాధ్యాయుడు వచ్చే వరకు ఇదే పాఠశాలలో పాఠాలు బోధించేందుకు ఆదేశించారు. అయితే  ఉపాధ్యాయులు లేని కారణంగా పిల్లల భవితపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారిని సమీపంలోని జిన్‌గుర్తి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని