logo

Pushpak Bus Pass: పుష్పక్‌ ఏసీ జనరల్‌ బస్‌పాస్‌ రూ.5 వేలు

విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ‘పుష్పక్‌ ఏసీ జనరల్‌ బస్‌పాస్‌’ను ప్రవేశపెట్టింది.

Updated : 04 Jul 2024 08:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ‘పుష్పక్‌ ఏసీ జనరల్‌ బస్‌పాస్‌’ను ప్రవేశపెట్టింది. రూ.5,000 బస్‌పాస్‌తో.. పుష్పక్‌ ఏసీ బస్సులతోపాటు ఇతర బస్సుల్లోనూ గ్రేటర్‌లో ఏ మార్గంలోనైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు ఆర్టీసీ పేర్కొంది. మరోవైపు జనరల్‌ రూట్‌పాస్‌ను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. శంషాబాద్, ఆరాంఘర్, బాలాపూర్‌ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు రూట్‌పాస్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక గ్రీన్‌ మెట్రో గ్రేటర్‌జోన్‌లోని ప్రయాణికుల కోసం మెట్రో లగ్జరీ ఏసీ నెలవారీ బస్‌పాస్‌ కేవలం రూ.1900కే ప్రవేశపెట్టారు. ఈ పాస్‌తో గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో (సికింద్రాబాద్‌ - పటాన్‌చెరు (219 మార్గం), బాచుపల్లి - వేవ్‌రాక్‌ వయా జేఎన్టీయూ (195 మార్గం), కోఠి - కొండాపూర్‌ వయా లక్డీకాపూల్, మాసాబ్‌ట్యాంక్, మాదాపూర్, హైటెక్‌సిటీ (127కె) మార్గాల బస్సుల్లో చెల్లుతుంది. ఇ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో సిటీ సబర్బన్‌ పరిధిలోనూ ప్రయాణించొచ్చు.

ఎయిర్‌పోర్ట్‌కు రూట్‌పాస్‌ ధరలు

  • శంషాబాద్‌ నుంచి రూ.2,000
  • ఆరాంఘర్‌ నుంచి రూ.3000
  • బాలాపూర్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి రూ.3000
  • ఎల్బీనగర్‌ నుంచి రూ.4000
  • గచ్చిబౌలి నుంచి రూ.4000

    జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్లకు బాధ్యతలు

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ నుంచి ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) డైరెక్టరేట్‌ను వేరుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటివరకు సంబంధిత డైరెక్టర్‌ పరిధిలో ఉన్న రవాణా, ప్రకటనల విభాగాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తన ఆధీనంలోకి తీసుకున్నారు. పారిశుద్ధ్యం, రవాణా విభాగాల అదనపు కమిషనర్‌గా సికింద్రాబాద్‌ జడ్సీ రవికిరణ్‌ను, ప్రకటనల విభాగాన్ని అదనపు కమిషనర్‌ సత్యనారాయణకు, ఆరోగ్య విభాగాన్ని అదనపు కమిషనర్‌ పంకజకు కేటాయిస్తూ ఆమె బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని