logo

హాస్టల్‌ విద్యార్థులకు దోమ కాటు!

హైదరాబాద్‌లోని పలు కళాశాలలకు చెందిన హాస్టళ్లు, ప్రైవేటు వసతిగృహాల్లో  దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఉన్నత విద్యాభ్యాసానికి కళాశాల హాస్టల్‌లో, పోటీ పరీక్షల నిమిత్తం ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్న అభ్యర్థులు దోమ కాటుకు గురవుతున్నారు.

Published : 03 Jul 2024 02:05 IST

లోపించిన పరిశుభ్రత.. పెరుగుతున్న డెంగీ కేసులు
ఈనాడు, హైదరాబాద్‌ 

హైదరాబాద్‌లోని పలు కళాశాలలకు చెందిన హాస్టళ్లు, ప్రైవేటు వసతిగృహాల్లో  దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఉన్నత విద్యాభ్యాసానికి కళాశాల హాస్టల్‌లో, పోటీ పరీక్షల నిమిత్తం ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్న అభ్యర్థులు దోమ కాటుకు గురవుతున్నారు. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, తగినన్ని ఫ్యాన్లు, దోమ తెరల లాంటి వసతులు లేకపోవడంతో జ్వరాల బారినపడుతున్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. నల్లకుంట ప్రభుత్వ ఫీవర్‌ ఆసుపత్రి, ఉస్మానియా, గాంధీ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది. ఉస్మానియా, గాంధీలో నిత్యం ఓపీకి 1500-2000 మంది వస్తున్నారు. మూడేళ్లుగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, అతిసారం, డయేరియా కేసులు పెరుగుతున్నాయి.   

అప్రమత్తతతో..

దోమల కారణంగా మలేరియా, డెంగీ, గన్యా వ్యాధులు పెరుగుతుంటాయి. ఈ వ్యాధుల బారిన పడకుండా దోమల నియంత్రణకు పరిసరాల పరిశుభ్రత పాటించాలి.  ఇంట్లో దుమ్ము ధూళి, పాత సామగ్రిని శుభ్రం చేయాలి. ఇంటి చుట్టూ, పూల కుండీలు, కూలర్లల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగడం మంచిది కాదు. బయట ఆహారానికి దూరంగా ఉండటమే మేలు. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తీసుకోవాలి.

మూడు రోజుల కంటే జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలు వేధిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని