logo

Vande Bharat: ఆగస్టు 15 నుంచి వందే భారత్‌ స్లీపర్‌.. సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన

కొత్తగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. వీటిని కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి నడపాలని ద.మ రైల్వే అధికారులు ప్రతిపాదించారు.

Updated : 03 Jul 2024 07:55 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: కొత్తగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. వీటిని కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి నడపాలని ద.మ రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటికే కాచిగూడ-బెంగళూర్, సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఛైర్‌కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ-బెంగళూర్‌ వందే భారత్‌ 8 బోగీలతో నడుస్తుండగా మిగిలిన 2 రైళ్లు 16 బోగీలతో నడుస్తుండడం విశేషం. ఇవి ఏసీ బోగీలు కావడంతో టికెట్‌ ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవు. 

మూడు రూట్లలో

కొత్తగా నడుపనున్న వందే భారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అత్యంత రద్దీ రూట్లైన కాచిగూడ-విశాఖ, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-పుణె మార్గాల్లో నడపాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కొత్త వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు 16 బోగీలతో రాత్రి నడపనున్నారు. ఇవి ఏసీ, నాన్‌ఏసీ కోచ్‌లు కావడంతో టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని అంటున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని