logo

కుండపోతతో తడిసిన నగరం

నగర వ్యాప్తంగా మంగళవారం రాత్రి పది గంటల సమయంలో కుండపోత వాన కురిసింది. అరగంటలోనే హిమాయత్‌ నగర్‌లో 3.6 సెం.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది.

Published : 03 Jul 2024 01:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగర వ్యాప్తంగా మంగళవారం రాత్రి పది గంటల సమయంలో కుండపోత వాన కురిసింది. అరగంటలోనే హిమాయత్‌ నగర్‌లో 3.6 సెం.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 1.2 సెం.మీ, రాయదుర్గం, ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బన్సీలాల్‌పేట, మాదాపూర్, అబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉన్నట్టుండి గాలివాన కురవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని