logo

కొత్త చట్టం ప్రకారం ఆబ్కారీ శాఖలో తొలి కేసు

కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాల కింద ఆబ్కారీ శాఖ తొలి కేసు నమోదు చేసింది.

Published : 03 Jul 2024 01:43 IST

ఈనాడు- హైదరాబాద్‌: కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాల కింద ఆబ్కారీ శాఖ తొలి కేసు నమోదు చేసింది. బాలానగర్‌ ఆబ్కారీ ఠాణా పరిధిలో 2.1 కేజీల గంజాయితో పట్టుబడ్డ మహిళ, యువకుడిపై ఈ కేసు రిజిస్టర్‌ చేసినట్లు మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌కే ఫయాజుద్దీన్, ఏఈఎస్‌ మాదవయ్య, బాలానగర్‌ సీఐ నర్సిరెడ్డి తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చి విక్రయిస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న మేడ్చల్‌ జిల్లా ఆబ్కారీ టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై పవన్‌కుమార్‌రెడ్డి బృందం బాలానగర్‌లో మాటువేసింది. ద్విచక్రవాహనం మీద వెళ్తున్న విజయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన సాయితేజను అడ్డుకుని తనిఖీలు చేయగా 2.1 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులను బాలానగర్‌ ఆబ్కారీ ఠాణాకు తరలించి సరకు సీజ్‌ చేశారు. కొత్త చట్టం నిబంధనల ప్రకారం తనిఖీ, స్వాధీన ప్రక్రియను చిత్రీకరించినట్లు వివరించారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని