logo

టార్గెట్‌ 26

మూడు జిల్లాల పరిధిలో వందలాది రెడ్‌ కేటగిరీ పరిశ్రమలుండగా ప్రతి పరిశ్రమను ఆరు నెలలకోసారి తనిఖీ చేయాలని సీపీసీబీ(కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) నిబంధనలు చెబుతున్నాయి.

Updated : 03 Jul 2024 02:16 IST

రెడ్‌ కేటగిరీ పరిశ్రమల్లో తనిఖీలకు సిద్ధమైన పీసీబీ
ఈనాడు, హైదరాబాద్‌

మూడు జిల్లాల పరిధిలో వందలాది రెడ్‌ కేటగిరీ పరిశ్రమలుండగా ప్రతి పరిశ్రమను ఆరు నెలలకోసారి తనిఖీ చేయాలని సీపీసీబీ(కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) నిబంధనలు చెబుతున్నాయి. ఇందుకోసమే ‘కంప్యూటరైజ్డ్‌ ఇన్‌స్పెక్షన్స్‌’ సాంకేతికతను రూపొందించారు. ఇటు పీసీబీ అధికారులకు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల జాబితా పంపడంతో పాటు పీసీబీ సర్వర్‌కు అనుసంధానమైన పరిశ్రమల నిర్వాహకులను అప్రమత్తం చేస్తుంది. ఏ అధికారి తనిఖీకి వస్తున్నారు.. ఎప్పుడొస్తున్నారనే సమాచారం మాత్రం గోప్యంగా ఉంటుంది. సమాచారం అందుకున్న అధికారి నెల రోజుల్లో నిర్దేశించిన లక్ష్యం పూర్తిచేయాలి. తనిఖీల్లో భాగంగా ఉత్పత్తుల నివేదిక, నీటి వినియోగం, వ్యర్థ జలాల ఉత్పత్తి తదితరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కాలుష్య ఉద్గారాలు కనిపిస్తే నమూనాలు తీసి ల్యాబ్‌కు పంపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారు. తనిఖీల తర్వాత 48 గంటల్లోగా ప్రాథమిక నివేదికను సూచించిన ఫార్మాట్‌లో ఉన్నతాధికారులకు సమర్పించాలి. అనంతరం కాలుష్య ఉద్గారాల స్థాయుల ఆధారంగా, ప్రమాణాలు పాటించని పరిశ్రమల దస్త్రాలను టాస్క్‌ఫోర్స్‌ బృందానికి పంపుతారు.  సూచించిన మార్గదర్శకాలు పాటించని పరిశ్రమలకు బ్యాంకు గ్యారంటీల సమర్పణ, మూసివేత తదితరాలకు ఆదేశాలిస్తారు. 


రిశ్రమల్లో విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలకు చెక్‌ పెట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రతినెలా రెడ్‌ కేటగిరీ పరిశ్రమల్లో తనిఖీలు చేస్తోంది.  నెల మొదటి వారంలోనే ఏ అధికారి.. ఏ పరిశ్రమను తనిఖీ చేయాలో ప్రోగ్రామింగ్‌ సాఫ్ట్‌వేర్‌ నిర్దేశిస్తుంది. జులైకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 74 పరిశ్రమల్లో తనిఖీలు నిర్దేశించుకోగా అందులో 26 రాజధాని పరిధిలోనే ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పరిశ్రమలు కూడా ఉన్నాయి. మల్కాజిగిరిలో 15, హైదరాబాద్‌ జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 6 పరిశ్రమలను పీసీబీ అధికారులు తనిఖీచేసి నివేదిక సమర్పించనున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు