logo

హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ వారోత్సవాలు షురూ

హుస్సేన్‌సాగర్‌లో ఆహ్లాదకర వాతావరణంలో సెయిలింగ్‌ పోటీలు మంగళవారం  ప్రారంభమయ్యాయి. 38వ హైదరాబాద్‌ సెయిలింగ్‌ వారోత్సవాలను ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్, లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Published : 03 Jul 2024 01:36 IST

రెజిమెంటల్‌బజార్‌:  హుస్సేన్‌సాగర్‌లో ఆహ్లాదకర వాతావరణంలో సెయిలింగ్‌ పోటీలు మంగళవారం  ప్రారంభమయ్యాయి. 38వ హైదరాబాద్‌ సెయిలింగ్‌ వారోత్సవాలను ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్, లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంసీఈఎంఈ) కమాండెంట్, లెఫ్టినెంట్‌ జనరల్‌ నీరజ్‌ వార్స్‌నే నేతృత్వంలో  డీజీఈఎంఈ, సీనియర్‌ కల్నల్‌ కమాండెంట్, ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌ ప్యాట్రన్, లెఫ్టినెంట్‌ జనరల్‌ జేఎస్‌ సిదానా ప్రారంభించారు. 15 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారిగా పోటీల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే విషయమై అంతర్జాతీయ జడ్జిలతో సెమినార్‌ను నిర్వహించినట్లు చెప్పారు. వారోత్సవాల్లో భాగంగా దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్‌ సెయిలర్లకు వైఏఐ కోచింగ్‌ క్యాంపును నిర్వహిస్తున్నామని, దీనిలో బాలికలూ పాల్గొనడం విశేషమన్నారు. ఆర్మీ అధికారులు, సిపాయిల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాలుగు రోజులపాటు కొనసాగే సెయిలింగ్‌ క్రీడలను సందర్శకులు ఉచితంగా వీక్షించవచ్చన్నారు. ఈ నెల 7న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని