logo

మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించాలి

వైద్యులు వ్యాపార ధోరణితో కాకుండా మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలని లోక్‌సత్తా అధినేత డా.జయప్రకాశ్‌ నారాయణ్‌ పేర్కొన్నారు.

Published : 03 Jul 2024 01:35 IST

సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: వైద్యులు వ్యాపార ధోరణితో కాకుండా మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలని లోక్‌సత్తా అధినేత డా.జయప్రకాశ్‌ నారాయణ్‌ పేర్కొన్నారు. కమలాకర మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సంస్కృతి ఆధ్వర్యంలో మంగళవారం సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాష నిలయంలో నిర్వహించిన డా. బి.సి.రాయ్‌ జయంతి వేడుకల్లో డా.జయప్రకాశ్‌ నారాయణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ వైద్య నిపుణులు డా.బాలాంబ పురాణం, డా.వై.ఎస్‌.ఎన్‌.మూర్తి, డా.ఎన్‌.ఎస్‌.దాస్‌లను ధర్మ ప్రచారకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కళారత్న డాక్టర్‌ కె.వి.కృష్ణకుమారి, కమలాకర మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ భారతి కమలాకర, ప్రముఖ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి, భాషా నిర్ణయం గౌరవ కార్యదర్శి టి.ఉదయవర్లు తదితరులతో కలిసి డా.బి.సి.రాయ్‌ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు