logo

విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది గురువులే

గురువుల విశిష్ట పాత్ర విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడుతుందని, కళాశాల యాజమాన్యం కమిటీ సభ్యుల సమష్టి కృషి వల్లే 50 వసంతాల ప్రయాణం సులభతరమైందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు అన్నారు.

Published : 03 Jul 2024 01:34 IST

మారేడుపల్లి, న్యూస్‌టుడే: గురువుల విశిష్ట పాత్ర విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడుతుందని, కళాశాల యాజమాన్యం కమిటీ సభ్యుల సమష్టి కృషి వల్లే 50 వసంతాల ప్రయాణం సులభతరమైందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు అన్నారు. వెస్ట్‌ మారేడుపల్లి కస్తూర్బా గాంధీ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల  50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా  స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శ్రీధర్‌ బాబు హాజరయ్యారు.   పూర్వ విద్యార్థిని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, ఓజీఏ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ టీవీ గోపాలచారి, ఎకనామిక్‌ కమిటీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ డి.గంగాధర్‌ రావు, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్‌ వనం, ఎగ్జిబిషన్‌ సొసైటీ గౌరవ కార్యదర్శి బి.హనుమంతరావు, కళాశాల కమిటీ ఛైర్మన్‌ అశోక్‌ గోపతి, కళాశాల కమిటీ గౌరవ కార్యదర్శి, కరస్పాండెంట్‌ మహమ్మద్‌ ఫహీముద్దీన్, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజశ్రీ తదితరులతో కలిసి ఆయన జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల గోల్డెన్‌ జూబ్లీ సావనీరును ఆవిష్కరించారు. ప్రిన్సిపల్, కమిటీ సభ్యులతో కలిసి ఆయన కళాశాల మాజీ ప్రిన్సిపల్స్, మాజీ ఛైర్మన్, మాజీ సెక్రటరీలను ఘనంగా సత్కరించారు. కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కళాశాలలో డేటా సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ తదితర ఆధునిక కోర్సులను కళాశాలలో ప్రవేశపెట్టాలని సూచించారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని