logo

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి

ర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

Published : 03 Jul 2024 01:34 IST

బషీర్‌బాగ్‌: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడిగా ఎన్నికైన కె.విరాహాత్‌ అలీ, జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మగాని కిరణ్‌కుమార్, సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌గా పదవీ విరమణ చేసిన రవికాంత్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వర్కాల యాదగిరి,  కోశాధికారి ఎం.వెంకట్‌రెడ్డి,  కార్యవర్గసభ్యులు కె.అనిల్‌కుమార్, ఎ.రాజేశ్, సయ్యద్‌ గౌస్‌ మోయినుద్దీన్‌లకు తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నాలుగు ప్రాంతాల్లో స్థలాలు గుర్తించి అందచేస్తామన్నారు.  జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీకి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని,  త్వరలో అందజేస్తామన్నారు. ఐజేయూ జాతీయ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్,  జాతీయ కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి  హరి, హెచ్‌యూజే అధ్యక్షుడు శంకర్‌గౌడ్, కె.సురేంద్రన్, బీహెచ్‌ఎంకే గాంధీ, ఎన్‌.శ్రీనివాస్, ఎంఏ సర్వర్, అలీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని