logo

డెంగీ జ్వరాల కట్టడికి యత్నం

డెంగీ జ్వరాలను కట్టడి చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుంది. మంగళవారం అదనపు కమిషనర్, సికింద్రాబాద్‌ జడ్సీ రవికిరణ్‌ సమీక్ష నిర్వహించారు.

Published : 03 Jul 2024 01:32 IST

ఇంటింటి తనిఖీలకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: డెంగీ జ్వరాలను కట్టడి చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుంది. మంగళవారం అదనపు కమిషనర్, సికింద్రాబాద్‌ జడ్సీ రవికిరణ్‌ సమీక్ష నిర్వహించారు. ‘మొత్తం 4,846 కాలనీల్లో ప్రతి కార్మికుడు 6 రోజుల్లో 3 కాలనీల్లోని అన్ని ఇళ్లను పరిశీలించాలి. దోమలు పెరిగేందుకు ఆస్కారమున్న ప్రదేశాలను గుర్తించి మందు పిచికారీ చేయాలి. ప్రతి కాలనీలో ఆరు రోజులకోసారి ఫాగింగ్‌ జరగాలి. ఆ చర్యలను ఉన్నతాధికారులు తనిఖీ చేయాలి. డెంగీ సోకిన వారి ఇళ్లపై దృష్టి పెట్టండి. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలపాటు ఇంట్లో నీటి నిల్వలను తొలగించేలా ప్రచారం చేయాలి. ట్విట్టర్, ఫేస్‌బుక్, మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్, ఇతర మార్గాల్లో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి’ అని స్పష్టంచేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని