logo

20 రోజులుగా పాఠశాల మూత

వికారాబాద్‌ జిల్లా, తాండూరు మండలం గుండ్లమడుగుతండాలో ప్రభుత్వ పాఠశాల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 రోజులుగా తెరుచుకోవడంలేదు.

Updated : 03 Jul 2024 05:29 IST

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: వికారాబాద్‌ జిల్లా, తాండూరు మండలం గుండ్లమడుగుతండాలో ప్రభుత్వ పాఠశాల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 రోజులుగా తెరుచుకోవడంలేదు. పరిస్థితి ఇలా ఉంటే ఉన్నత విద్యాధికారులెవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. స్థానికులు, తల్లిదండ్రులు మంగళవారం తెలిపిన ప్రకారం..ఈ బడిలో ఐదు తరగతుల వరకు 28 మంది విద్యార్థులున్నారు. ఇక్కడి ఉపాధ్యాయుడు 20 రోజులుగా గైర్హాజరు అవుతున్నారని, దీంతో మంగళవారం కూడా తెరుచుకోలేదని తెలిపారు. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఐదు కిలోమీటర్ల దూరానున్న జిన్‌గుర్తి పాఠశాలలో చేర్పించామన్నారు. ఉపాధ్యాయుడు రానందున మధ్యాహ్న భోజనం కూడా వండలేదని పొలం వద్ద ఉన్న నిర్వాహకురాలు తెలిపారు. విద్యాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని తల్లిదండ్రులు విమర్శించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని