logo

కూడళ్ల విస్తరణకు సై

ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన నగరంలోని ఇరుకు    కూడళ్లను విస్తరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో  ఇప్పటికే మూడు పోలీస్‌ కమిషనరేట్లు కూడళ్ల జాబితాను జీహెచ్‌ఎంసీకి అందించింది.

Published : 01 Jul 2024 04:34 IST

మూడు కమిషనరేట్ల పరిధిలో చౌరస్తాల ఎంపిక
క్షేత్రస్థాయి తనిఖీలకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ

బాలానగర్‌ వైజంక్షన్‌

ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన నగరంలోని ఇరుకు    కూడళ్లను విస్తరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో  ఇప్పటికే మూడు పోలీస్‌ కమిషనరేట్లు కూడళ్ల జాబితాను జీహెచ్‌ఎంసీకి అందించింది. వాటిపై నగర ప్రణాళిక విభాగం కసరత్తును ప్రారంభించింది. వరుస  ఎన్నికలతో గత కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ కూడళ్ల విస్తరణ ప్రక్రియను పరిశీలనలో ఉంచగా, కొత్త కమిషనర్‌ అనుమతి  తీసుకుని ప్రాధాన్యక్రమంలో పనులు  చేపడతామని ఇంజినీర్లు చెబుతున్నారు. 


రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో.. 

చక్రిపురం వై జంక్షన్, ఎన్‌ఎఫ్‌జీ కూడలి, కుషాయిగూడ ఠాణా సమీపంలోని రమాదేవి ఆస్పత్రి కూడలి, ఏఎస్‌రావునగర్, అశోక్‌నగర్, కెనరా బ్యాంకు కూడలి, నేతాజీనగర్, హెచ్‌బీకాలనీ ఎక్స్‌ రోడ్డు, తల్లూరి కూడలి, కుషాయిగూడ డీమార్ట్‌ కూడలి, శారద చౌరస్తా, ఈసీఐఎల్‌ ఎక్స్‌ రోడ్డు, రాధిక ఎక్స్‌ రోడ్డు, చిలకానగర్,  వీటీ కమాన్, ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్డు, నాగోల్‌ ఆనంద్‌నగర్‌ టీ జంక్షన్, హయత్‌నగర్‌ హైవే బావర్చి..


సైబరాబాద్‌  పరిధిలో..

ఆరాంఘర్‌ చౌరస్తా, పీడీపీ కూడలి, దుర్గానగర్‌ కూడలి,   పిల్లర్‌ నెం.294 కూడలి, పిల్లర్‌ నెం.202, బన్సీలాల్‌నగర్, ట్రిపుల్‌ ఐటీ కూడలి, శేరిలింగంపల్లి గుల్మొహర్‌ కూడలి, కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీసు, రాడిసన్‌ డీఎల్‌ఎఫ్, విప్రో జంక్షన్, కాంటినెంటల్‌ ఆస్పత్రి, ఖాజాగూడ, ఐసీఐసీఐ బ్యాంకు కూడలి, బయోడైవర్సిటీ, క్యూ సిటీ, సీఓడీ, గచ్చిబౌలి, ఆల్విన్‌కాలనీ, మియాఆపూర్, ఖానామెట్,  గూడెన్‌మెట్‌ కూడలి, తదితర కూడళ్లు.


హైదరాబాద్‌ పరిధిలో.. 

హబ్సిగూడ, నల్గొండ ఎక్స్‌ రోడ్డు, మిథాని, మదీనా, చాదర్‌ఘాట్‌ రోటరీ, నానల్‌నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి నోబుల్‌ టాకీస్, రేతిబౌలి, టప్పాచబుత్రా, పురానాపూల్, ఎంజీ బ్రిడ్జీ భూలక్ష్మి దేవాలయం, దామోదర సంజీవయ్య విగ్రహం కూడలి, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు, హుస్సేన్‌సాగర్‌ వరదనాలాపై బ్రిడ్జి నిర్మించి ఫ్రీ లెఫ్ట్‌ను పెంచడం, చాదర్‌ఘాట్‌ ఎక్స్‌ రోడ్డు, పంజాగుట్ట, జూబ్లిహిల్స్‌ రోడ్డు నెం.36, బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1, 2 జర్నలిస్టు కాలనీ, మహారాజ అగ్రసేన్‌ కూడలి,  తదితర కూడళ్లు ఉన్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

  • కమిషనరేట్ల వారీగా  గుర్తించిన కూడళ్ల సంఖ్య..
  • హైదరాబాద్‌ 48
  • రాచకొండ 44
  • సైబరాబాద్‌ 35
  • మొత్తం  127
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని