logo

గోవా గవర్నర్‌ రచనకు తెలుగు అనువాదం ‘రామ చిలుక’

గోవా గవర్నర్‌  శ్రీధరన్‌ పిళ్లై మళయాలంలో రాసిన ‘తథా వరతికిల్ల’ కథల సంపుటికి తెలుగు అనువారం‘రామ చిలుక’ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్‌ ఆవిష్కరించారు.

Published : 01 Jul 2024 03:32 IST

ప్రొ. ఇనాక్‌తో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్‌ రాధా కృష్ణన్, వెంకటేశం, ఎల్‌ఆర్‌ స్వామి, గోవా గవర్నర్‌ శ్రీధరన్‌ పిళ్లై,  

ఖైరతాబాద్‌ : గోవా గవర్నర్‌  శ్రీధరన్‌ పిళ్లై మళయాలంలో రాసిన ‘తథా వరతికిల్ల’ కథల సంపుటికి తెలుగు అనువారం‘రామ చిలుక’ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్‌ ఆవిష్కరించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడుతూ.. రచయిత శ్రీధరన్‌ పిళ్లై సాహిత్య వారసత్వానికి అమూల్యమైన కృషి చేశారన్నారు. పుస్తక రచయిత పిళ్లై మాట్లాడుతూ.. తొలి నుంచే రచనలు అలవాటు ఉండటంతో ఇప్పటి వరకు 200 వరకు పుస్తకాలు రాసినట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, గోవా గవర్నర్‌ కార్యదర్శి ఎంఆర్‌ఎం రావు, కవి, రచయిత కె.శివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌ రావు, రాజ్‌ భవన్‌ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని