logo

బాలికపై అత్యాచారం కేసులో 10 మందికి రిమాండ్‌

కాచిగూడకు చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నేరేడ్‌మెట్‌ పోలీసులు 10 మందిని ఆదివారం రిమాండ్‌కు తరలించారు. జూన్‌ 25న కాచిగూడ ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్‌  చేసి కేసును నేరేడ్‌మెట్‌కు బదిలీ చేశారు.

Published : 01 Jul 2024 03:11 IST

నేరేడ్‌మెట్‌: కాచిగూడకు చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నేరేడ్‌మెట్‌ పోలీసులు 10 మందిని ఆదివారం రిమాండ్‌కు తరలించారు. జూన్‌ 25న కాచిగూడ ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్‌  చేసి కేసును నేరేడ్‌మెట్‌కు బదిలీ చేశారు. పోలీసులు తొలుత అయిదుగురిని నిందితులుగా తేల్చారు. వారిని విచారిస్తే మరో అయిదుగురికి ప్రమేయం ఉందని నిర్ధారించి వారిని అరెస్టు చేశారు. బాలిక 6 నెలల గర్భిణి.  వగ్‌మారి బాలాజీ అలియాస్‌ బాలి (23), వగ్‌మారి దీపక్‌ (24), పీబీడీఏవీ పాఠశాల ప్రాంతానికి చెందిన గుద్దండి కృష్ణ (22), వినాయక్‌నగర్‌లో ఉంటున్న తొంటె కిరణ్‌కుమార్‌ (26), సుధానగర్‌లో ఉంటున్న బొల్లెపు అజయ్‌ (23), మారుతినగర్‌లో ఉంటున్న జేమ్స్‌ జేవియర్‌ (24), బండ చెరువు ఎన్‌బీహెచ్‌కాలనీకి చెందిన వింజమూరి మధు (30), మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన సబావత్‌ హత్యనాయక్‌   (25)కు బాలికను పరిచయం చేశారు. వీరు గంజాయిని శీతల పానీయంలో కలిపి బాలికకు తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. అలా బాలికను భయభ్రాంతులకు గురి చేసి పలుమార్లు  వినాయక్‌నగర్‌కు తీసుకువచ్చి అత్యాచారం చేశారు. పోలీసులు మొదట అయిదుగురిని అరెస్టు చేసి విచారించారు. మరి కొందరు ఈ ఘటనలో ఉండొచ్చని ‘ఈనాడు’లో కథనం ప్రచురితమవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తుచేసిమరో 5గురిని అరెస్టుచేసి విచారించగా వారు కూడా అత్యాచారం చేసినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని