logo

తింటే జామ్‌ అయిపోతుంది

చిన్నపాటి రేకుల షెడ్డు అది.. దాని పక్కనే మరుగుదొడ్డి. ప్రాంగణమంతా దుర్వాసన, వ్యర్థాలు.. అక్కడే కోవాలో కొద్ది మేర మైదా, మీగడను కలిపిన మిశ్రమంతో గులాబ్‌జామ్‌లను తయారు చేస్తున్నారు.

Published : 30 Jun 2024 03:27 IST

నేలపై ఇలా ఆరబెట్టి... 

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నపాటి రేకుల షెడ్డు అది.. దాని పక్కనే మరుగుదొడ్డి. ప్రాంగణమంతా దుర్వాసన, వ్యర్థాలు.. అక్కడే కోవాలో కొద్ది మేర మైదా, మీగడను కలిపిన మిశ్రమంతో గులాబ్‌జామ్‌లను తయారు చేస్తున్నారు. వీటినే పాఠశాలల వద్ద, వీధి దుకాణాల్లో విక్రయిస్తుండటం గమనార్హం. ఇవి తింటే ఆరోగ్యం పాడైపోవడం ఖాయం. పాతబస్తీ మైలార్‌దేవ్‌పల్లి ఉస్మాన్‌నగర్‌లోని బట్టీలో వెలుగుచూసిన దారుణ పరిస్థితులు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎస్‌ఓటీ పోలీసుల సమాచారంతో జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతాధికారి సిరాజ్‌ అహ్మద్, మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌ఐ పైడి నాయుడు శనివారం తయారీ కేంద్రంలో చేపట్టిన తనిఖీతో.. అనారోగ్యకర గులాబ్‌ జామ్‌ల విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్‌కే గుడ్‌ లక్‌ పేరుతో వాటిని డబ్బాల్లో నింపి, వీధుల్లోని కిరాణా దుకాణాల్లో, పాఠశాలల వద్ద అమ్ముతుంటారని, పిల్లలు ఎక్కువగా తింటుంటారని అధికారులు అంచనా వేశారు. ఉల్లంఘనలపై నోటీసు ఇచ్చి, కేంద్రాన్ని మూసేశామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని