logo

డయల్‌ యువర్‌ ఎండీ.. కాల్‌ కలిస్తే ఒట్టు

గ్రేటర్‌ వ్యాప్తంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జలమండలి ఎండీ దృష్టికి తెచ్చేందుకు వారం వారం నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారుతోంది.

Published : 30 Jun 2024 03:26 IST

కార్యక్రమంలో ఎండీ ఆశోక్‌రెడ్డి, ఈడీ సత్యనారాయణ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జలమండలి ఎండీ దృష్టికి తెచ్చేందుకు వారం వారం నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారుతోంది. ఎంతోమంది ఫోన్‌ చేస్తున్నా సరే...లైన్లు కలవడం లేదని వాపోతున్నారు. కొన్నిసార్లు రింగ్‌ అవుతున్నా ఫోన్‌ ఎత్తడం లేదని వాపోతున్నారు. తాజాగా శనివారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమంలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఖైరతాబాద్‌ ఓల్డ్‌ సీబీఐ క్వార్టర్స్‌లో ఉండే గోపీనాథ్‌ డ్రైనేజీ సమస్యపై పదేపదే ఫోన్‌ చేసినా పట్టించుకోలేదని వాపోయారు. చింతల్‌బస్తీ మెయిన్‌ రోడ్డులో ఆర్నెల్లుగా తాగునీరు లీకేజీ అవుతోంది. స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో పలుసార్లు ఫోన్‌ చేసినా కాల్‌ కలవలేదని చెప్పారు. మురుగు సమస్యపై జలమండలి 155313 నంబరుకు నెలకు 30-40 వేల వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు డయల్‌ యువర్‌ ఎండీకి తక్కువ ఫిర్యాదులు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత వారం 36 మంది ఫోన్‌ చేస్తే...ఈసారి కేవలం 13 కాల్స్‌ వచ్చాయని జలమండలి తెలిపింది. వాటిని నమోదు చేసుకున్న ఎండీ అశోక్‌రెడ్డి...సంబంధిత సమస్యలన్నీ పరిష్కరించాలని ఆయా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కనీసం గంట పాటు చేపట్టాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు