logo

మమకారం మరిచి.. అవ్వను రోడ్డుపై వదిలేసి

కన్నతల్లి అనే మమకారం కరవైంది. ఏడుపదుల వయసులో మాతృమూర్తిని ఆదరించాల్సిన కుటుంబ సభ్యుల కాఠిన్యంతో  ఆమె రోడ్డు పాలైంది.

Updated : 30 Jun 2024 06:23 IST

పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: కన్నతల్లి అనే మమకారం కరవైంది. ఏడుపదుల వయసులో మాతృమూర్తిని ఆదరించాల్సిన కుటుంబ సభ్యుల కాఠిన్యంతో  ఆమె రోడ్డు పాలైంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జిన్నారం మండలానికి చెందిన భారతమ్మ(70)ను ఆమె కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పటాన్‌చెరు శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో రహదారిపై వదిలి వెళ్లిపోయారు. మూడు రోజులుగా ఆమెకు ఆహారం ఇచ్చిన కాలనీవాసులు పటాన్‌చెరు పోలీసులకు సమాచారమిచ్చారు. జిన్నారం పోలీసులకు సమాచారమివ్వడంతో వచ్చి విచారించారు.


ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయ్‌..!

వృద్ధుడిపై కుమారులు, మనవల దాడి

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: ఆస్తిపత్రాలు ఎక్కడున్నాయంటూ 88 ఏళ్ల వృద్ధుడిపై ఇద్దరు కొడుకులతో పాటు మనువళ్లు దాడిచేసి గాయపర్చిన ఘటన మధురానగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మధురానగర్‌లో ఉంటున్న డీఎంవీ గోపాలరావుకు ముగ్గురు కుమారులు. ఆయన మూడో కుమారుడు రమేష్‌కుమార్‌ప్లాట్‌లో ఉంటున్నారు. ఈనెల 28న కేర్‌టేకర్‌ ఫోన్‌చేసి.. గోపాలరావుని మొదటి, రెండో కుమారులు పట్టాభి రామయ్య, వెంకటేశ్వర్‌రావు, మనవలు కొడుతున్నారని డయల్‌ 100కు తెలిపారు. వృద్ధుడిని గాయపర్చారనిరమేష్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని