logo

విజ్ఞాన మార్పిడితో రోగులకు మెరుగైన చికిత్స

వైద్యులు పరస్పరం విజ్ఞానాన్ని పంచుకో వడం ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్యచికిత్స అందించాలని ప్రముఖ రేడియేషన్‌ అంకాలజిస్టు, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌

Published : 30 Jun 2024 03:12 IST

హాజరైన డా.శ్రీనాథ్‌ గుప్తా, ఫణికోటేశ్వరరావు, సుబ్రమణ్యేశ్వరరావు, ఆనంద్‌ రాజా, అశిష్‌ గులియా, కె.కృష్ణయ్య, నోరి దత్తాత్రేయుడు, కల్పన రఘునాథ్, సృజన్‌ శుక్లా  

బంజారాహిల్స్, న్యూస్‌టుడే: వైద్యులు పరస్పరం విజ్ఞానాన్ని పంచుకో వడం ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్యచికిత్స అందించాలని ప్రముఖ రేడియేషన్‌ అంకాలజిస్టు, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (బీఐఏసీహెచ్‌ అండ్‌ ఆర్‌ఐ) ట్రస్టు బోర్డు సభ్యుడు డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు. ఎముకలు, మృదు కణజాలాలలో అభివృద్ధి చెందే ‘సార్కొమా’ అనే అరుదైన క్యాన్సర్‌ వ్యాధిపై రెండురోజుల పాటు నిర్వహించే జాతీయస్థాయి సదస్సు శనివారం బసవతారకం ఆస్పత్రిలో ప్రారంభమైంది. బీఐఏసీహెచ్‌ అండ్‌ ఆర్‌ఐ, తెలంగాణ ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ అసోసియేషన్, ట్విన్‌ సిటీస్‌ ఆర్థోపెడిక్‌ సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో సంస్థ సీఈవో డా.కె.కృష్ణయ్య, వైద్యులు శ్రీనాథ్‌ గుప్తా, ఫణికోటేశ్వరరావు, టి.సుబ్రమణ్యేశ్వరరావు, ఆనంద్‌ రాజా, అశిష్‌ గులియా,  కల్పన రఘునాథ్, సృజన్‌ శుక్లా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని