logo

దేశ భద్రతకు నూతన సాంకేతిక ఆవిష్కరణలు దోహదం

ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎంసీఈఎంఈలో శిక్షణను పూర్తిచేసుకున్న యువ అధికారులు సాంకేతికంగా అన్ని అంశాల్లో భారత సైన్యం పటిష్టపడేలా కృషిచేయాలని

Published : 30 Jun 2024 03:10 IST

స్టూడెంట్‌ ఆఫీసర్లతో రమేష్‌ కంచర్ల, లెఫ్టినెంట్‌ జనరల్‌ నీరజ్, అధీష్‌ సిన్హా 

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎంసీఈఎంఈలో శిక్షణను పూర్తిచేసుకున్న యువ అధికారులు సాంకేతికంగా అన్ని అంశాల్లో భారత సైన్యం పటిష్టపడేలా కృషిచేయాలని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ ఆసుపత్రి సీఎండీ డాక్టర్‌ రమేశ్‌ కంచర్ల అన్నారు. తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంసీఈఎంఈ) ఆడిటోరియంలో శనివారం టెక్నికల్‌ ఎంట్రీ స్కీం (టీఈఎస్‌)-41కోర్సు 105వ స్నాతకోత్సవం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ రమేశ్‌ కంచర్ల, ఎంసీఈఎంఈ కమాండెంట్, లెఫ్టినెంట్‌ జనరల్‌ నీరజ్‌ వార్స్‌నేతో కలిసి కోర్సులో శిక్షణను పూర్తి చేసుకున్న భారత యువ అధికారులతోపాటు స్నేహపూర్వక దేశాలైన రాయల్‌ భూటాన్, శ్రీలంకలకు చెందిన అధికారులకు బీటెక్‌ డిగ్రీ పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. భారత సైన్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వృద్ధిచేసి సైన్యాన్ని పటిష్ఠం చేసే దిశగా యువ అధికారులు కృషి చేయాలని సూచించారు. శిక్షణకాలంలో ప్రతిభను కనబరిచిన లెఫ్టినెంట్‌ థోరట్‌ సందేశ్‌ సంజయ్, లెఫ్టినెంట్‌ హర్షిద్‌ ద్వివేదిలకు కమాండెంట్స్‌ రజత పతకాలు, డీజీఈఎంఈ బంగారు పతకం, జీవోసీ-ఇన్‌-ఆర్‌ట్రాక్‌ ట్రోఫీ, బుక్‌ప్రైజ్‌లను అందజేశారు. ఎయిర్‌ మార్షల్‌ శ్రీనివాస్‌తోపాటు వివిధ విభాగాల అధికారులు, యువ అధికారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని