logo

రాజస్థాన్‌ నుంచి వచ్చి.. చైన్‌ స్నాచింగ్‌లు

బాలానగర్‌ జోన్‌లో వరస చైన్‌ స్నాచింగ్‌లతో హల్‌చల్‌ చేసిన గొలుసు దొంగను సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 30 Jun 2024 03:03 IST

ద్విచక్రవాహనం మీద నిందితుడు మహేందర్‌ సింగ్‌ 

ఈనాడు- హైదరాబాద్, బాచుపల్లి, న్యూస్‌టుడే: బాలానగర్‌ జోన్‌లో వరస చైన్‌ స్నాచింగ్‌లతో హల్‌చల్‌ చేసిన గొలుసు దొంగను సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24న బాచుపల్లి, 25న జగద్గిరిగుట్ట ఠాణాల పరిధిలో రెండు చైన్‌ స్నాచింగ్‌లు, జీడిమెట్లలో గొలుసు దొంగతనానికి యత్నించిన నిందితుడిని శనివారం పట్టుకున్నారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన మహేందర్‌ సింగ్‌(40)గా గుర్తించి బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. 
పట్టించిన సీసీ ఫుటేజీలు.. 24న బాచుపల్లి ఠాణా ప్రగతినగర్‌ ఇన్‌కాయిస్‌ రోడ్డులో కోటేశ్వరమ్మ నడుచుకుంటూ వెళ్తుండగా బైకు మీద వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలోని గొలుసు తెంపుకొని పరారయ్యాడు. బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే, 25న జీడిమెట్ల హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన సిరివల్లి(18) మెడలోని గొలుసు తెంపేందుకు ప్రయత్నించగా  కుదరలేదు. అటు నుంచి జగద్గిరిగుట్టకు చేరుకొని అక్కడ మరో మహిళ మెడలోని గొలుసు తెంపుకొని పరారయ్యాడు. వాహనం నంబరు, సీసీ ఫుటేజీల ఆధారంగా బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దొంగతనాల కోసం రాజస్థాన్‌ నుంచి వస్తాడని.. చోరీ చేశాక మళ్లీ వెళ్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని