logo

పర్యాటక రంగ అభివృద్ధితో పేదలకు ఉపాధి: స్పీకర్‌

వికారాబాద్‌-అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి  చేయటంలో భాగంగా పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.

Published : 30 Jun 2024 02:50 IST

కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్,  అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ 

వికారాబాద్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: వికారాబాద్‌-అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి  చేయటంలో భాగంగా పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో అనంతగిరి పర్యాటక అభివృద్ధిపై చేపట్టాల్సిన పనుల గురించి చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌తో కలిసి సమీక్షించారు. పర్యావరణ, పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను ఎల్‌ అండ్‌ టీ ప్రాజెక్టు మేనేజర్‌ సుమతి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పర్యాటక రంగాల అభివృద్ధికి స్వచ్ఛ దర్శన్‌ పథకం కింద రూ.110 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో 213 ఎకరాల్లో పనులు చేపట్టడానికి ప్రణాళికలను రూపొందించారన్నారు. నిధులు వృథా చేయకుండా అవసరమైనవి, ప్రజలకు ఉపయోగపడే పనులను చేపట్టాలని సూచించారు. ఇదే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అధికంగా కల్పించాలని కోరారు. 

జిల్లా రూపు రేఖలు మారిపోతాయి: ఎంపీ

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే జిల్లాలోని పలు ప్రాంతాల రూపురేఖలు అద్భుతంగా మారతాయన్నారు. అనంతగిరితో పాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి, శివసాగర్, లక్నాపూర్, ప్రాజెక్టులు, దామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ  సమావేశంలో నీటి పారుదల శాఖ జిల్లా అధికారిణి రేణుక, ఈఈ సుందర్, అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్, జిల్లా యువజన, క్రీడల అధికారి హన్మంత్‌రావు, మత్స్య శాఖాధికారిణి సౌజన్య, దేవాదాయ శాఖాధికారి నరేందర్, కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని