logo

అన్ని హోటళ్లు తనిఖీ చేస్తాం

మున్సిపల్‌ పరిధిలోని అన్ని హోటళ్లను తనిఖీ చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ బలరాం నాయక్‌ తెలిపారు. శనివారం స్థానిక ఎస్‌వీఆర్‌ దాబాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 30 Jun 2024 02:48 IST

దాబా లోపల పరిస్థితి 

కొడంగల్, న్యూస్‌టుడే: మున్సిపల్‌ పరిధిలోని అన్ని హోటళ్లను తనిఖీ చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ బలరాం నాయక్‌ తెలిపారు. శనివారం స్థానిక ఎస్‌వీఆర్‌ దాబాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో వచ్చి దాబా కిచెన్‌ రూంలోని సరకులను, అడ్వాన్స్‌గా తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టిన సామాను సైతం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం నుంచి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను తీసుకొని వచ్చి అన్ని హోటళ్లు తనిఖీ చేస్తామన్నారు.  ఇప్పటికీ కొందరు రోడ్డుపై టిఫెన్లు, ఇతర తినుబండారాలు మురుగు కాలువల పక్కన  విక్రయిస్తున్నారని వీరిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని