logo

11 నిమిషాలు.. రూ.18 లక్షలు

సైబర్‌ నేరస్థుల చేతిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మోసపోయిన డబ్బుకు పోలీసులు నిమిషాల వ్యవధిలో అడ్డుకట్ట వేశారు.

Published : 29 Jun 2024 02:51 IST

సైబర్‌ నేరస్థుల నుంచి కాపాడిన పోలీసులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: సైబర్‌ నేరస్థుల చేతిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మోసపోయిన డబ్బుకు పోలీసులు నిమిషాల వ్యవధిలో అడ్డుకట్ట వేశారు. హైదరాబాద్‌ డీసీపీ (సైబర్‌ క్రైమ్స్‌) ధారా కవిత తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట్‌లో నివసించే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఫెడెక్స్‌ కొరియర్‌ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీ ఆధార్‌ కార్డు నంబరుతో ముంబయి నుంచి ఇరాన్‌కు మాదకద్రవ్యాలతో కూడిన పార్సిల్‌ బుక్‌ అయిందని.. దీనిపై స్థానిక సైబర్‌ పోలీసుల వద్ద కేసు నమోదైందని సమాచారం ఇచ్చాడు.  బాధితుడి పేరిట నమోదైన కేసు తాలుకు ఎఫ్‌ఐఆర్, ఇతర కీలకపత్రాలను చూపించారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్‌ చేశారు. బాధితుడి వద్ద డబ్బు లేదు. బాధితుడు రూ.18 లక్షలు నేరస్థుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని