logo

నిర్లక్ష్యంగా నీటి గుంత.. చిన్నారి మృత్యువాత

అటవీశాఖ నర్సరీలో మొక్కలకు నీరందించేందుకు తవ్విన భారీ గుంతను నిర్లక్ష్యంగా వదిలివేయడంతో రెండేళ్ల బాలుడు మృత్యువాత పడిన ఘటన శామీర్‌పేటలో శుక్రవారం జరిగింది.

Published : 29 Jun 2024 02:38 IST

 బాలుడిని ఆస్పత్రికి తరలిస్తున్న బాధితులు  

శామీర్‌పేట, న్యూస్‌టుడే: అటవీశాఖ నర్సరీలో మొక్కలకు నీరందించేందుకు తవ్విన భారీ గుంతను నిర్లక్ష్యంగా వదిలివేయడంతో రెండేళ్ల బాలుడు మృత్యువాత పడిన ఘటన శామీర్‌పేటలో శుక్రవారం జరిగింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సురేంద్ర-రేష్మీ దంపతులు హకీంపేట క్రీడా పాఠశాలల ఆవరణలో అటవీశాఖ నిర్వహిస్తున్న నర్సరీలో కూలీ పని చేస్తున్నారు. ఆవరణలోనే రెండు భారీ గుంతలను అటవీశాఖ అధికారులు తవ్వించారు.అందులోనే మనబ్‌ ఆడుకుంటూ మునిగి చనిపోయాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని