logo

ఏటీఎంలో డబ్బు.. ఎలా వచ్చిందబ్బా

ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా ఆలస్యం అవడం.. డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తరువాత నగదు ప్రత్యక్షమైన ఘటన పాతబస్తీ హాషామాబాద్‌లో చోటుచేసుకుంది.

Published : 29 Jun 2024 05:21 IST

డబ్బులు స్వాధీనం చేసుకున్న బండ్లగూడ ఏఎస్సై శంకర్‌ 

కేశవగిరి, న్యూస్‌టుడే: ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా ఆలస్యం అవడం.. డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తరువాత నగదు ప్రత్యక్షమైన ఘటన పాతబస్తీ హాషామాబాద్‌లో చోటుచేసుకుంది. బండ్లగూడ ఠాణా ఏఎస్సై ఎం.శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట బండ్లగూడ రోడ్డులోని హాషామాబాద్‌ టవర్‌గల్లీ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.20వేలు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఏఎస్సై, సిబ్బంది యంత్రంలో డ్రా చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారులకు అప్పగిస్తామని, ఖాతాదారుడు ఆధారాలతో వచ్చి తీసుకోవచ్చని ఏఎస్సై చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని