logo

ఒకటికి నాలుగింతల లాభాలంటూ బురిడీ!

అదో నకిలీ కంపెనీ. అక్కడ పెట్టుబడితో అద్భుతమైన లాభాలు వస్తాయంటూ సామాన్యులను నమ్మించి నట్టేట ముంచిన ఘరానా మోసగాడు కడప జిల్లా రాజంపేటకు చెందిన గాదిరాజు గురుప్రసాద్‌ రాజు (32)ను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్టు సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌ తెలిపారు.

Published : 29 Jun 2024 02:27 IST

రూ.2 కోట్లు వసూలు చేసిన కేసులో అంతరాష్ట్ర నిందితుడి అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌: అదో నకిలీ కంపెనీ. అక్కడ పెట్టుబడితో అద్భుతమైన లాభాలు వస్తాయంటూ సామాన్యులను నమ్మించి నట్టేట ముంచిన ఘరానా మోసగాడు కడప జిల్లా రాజంపేటకు చెందిన గాదిరాజు గురుప్రసాద్‌ రాజు (32)ను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్టు సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌ తెలిపారు. 2015లో బి.ఎన్‌.సతీష్, ఎ.వెంకటచలపతి బెంగళూరులో కన్సల్టెన్సీ ప్రారంభించారు. గాదిరాజు రాజేంద్రప్రసాద్‌రాజు, గాదిరాజు గురుప్రసాద్‌రాజు, పాశం వెంకట్‌ ప్రసాద్, బైరెడ్డి జ్యోతి డైరెక్టర్లుగా కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఈ సంస్థ బ్రాంచి కార్యాలయాన్ని ప్రారంభించారు. 3 నెలలకు 1:1, ఏడాదిలో 1:4 లాభాలు వస్తాయని 150-200 మంది నుంచి రూ.2 కోట్లు వసూలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని