logo

పబ్‌ల్లో డీజేలు.. మాదక ద్రవ్యాల విక్రేతలు

జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌లలో డీజేలుగా వ్యవహరించే ఇద్దరు నిషేధిత మత్తుపదార్థాలతో అమీర్‌పేట ఆబ్కారీ అధికారులకు చిక్కారు.

Published : 29 Jun 2024 02:16 IST

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌లలో డీజేలుగా వ్యవహరించే ఇద్దరు నిషేధిత మత్తుపదార్థాలతో అమీర్‌పేట ఆబ్కారీ అధికారులకు చిక్కారు. వీరితో సంబంధం ఉన్న మరో వ్యక్తిని  అరెస్ట్‌ చేశారు. అమీర్‌పేట ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ పటేల్‌ బానోతు వివరాల ప్రకారం.. అమీర్‌పేట ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ బృందం శుక్రవారం బంజారాహిల్స్‌లో దాడులు  చేసి అఖిల్‌ని అదుపులోకి తీసుకొని డీజేగా గుర్తించారు. అతని నుంచి 2.65 గ్రాముల నిషేధిత ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా ఆదిభటలో నివసించే మరో ఇద్దరు ఇందులో ఉన్నట్లు గుర్తించారు.  అక్కడ దాడి చేసి బెంగళూరుకు చెంది ఆదిభట్లలో ఉంటున్న సన్నీ, అలెక్స్‌లను అదుపులోకి తీసుకొన్నారు. 12.48 గ్రాముల ఎండీఎంఏ, 326 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అఖిల్, సన్నీ జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, డెయిలీ డోస్, జోరా, ప్రిస్మ్, ఇల్యూజన్‌ పబ్‌లలో డీజేలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్‌ సూపరింటెండెంట్‌ ప్రదీప్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజుతోపాటు సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని