logo

Hyderabad: ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం

ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది.

Published : 04 Jul 2024 09:40 IST

బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి దారుణం


సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి

మియాపూర్, న్యూస్‌టుడే: ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. మియాపూర్‌ సీఐ దుర్గారామలింగ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉద్యోగ అన్వేషణలో నగరానికి వచ్చి ఉప్పల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి మియాపూర్‌లోని ఓ స్థిరాస్తి సంస్థ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి ఆమెకు పరిచయమయ్యారు. తమ సంస్థలో ఉద్యోగం ఉందంటూ నమ్మించిన వారు జూన్‌ 30న మియాపూర్‌ రావాలని కోరారు. ఉదయం ఆమె మియాపూర్‌కు రాగా స్థానికంగా ఓ హాస్టల్‌లో చేర్చారు.

శిక్షణ పేరుతో.. ఆ యువతికి స్థిరాస్తి వ్యాపారంపై అనుభవం లేకపోవడంతో శిక్షణ ఇప్పిస్తామంటూ నమ్మించారు. అదే రోజు మధ్యాహ్నం యాదగిరిగుట్ట సమీపంలోని వెంచర్లో శిక్షణ ఉందంటూ ఆమెను కారులో తీసుకెళ్లారు. అక్కడ మీటింగ్‌ తరువాత రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. కారు మరమ్మతుల పేరుతో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలో నిలిపి బలవంతంగా మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించారు. తరువాత తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. జులై 1న బాధితురాలు అస్వస్థతకు గురి కావడంతో 2న ఉప్పల్‌ వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అక్కడి పోలీసులు ఈ కేసును మియాపూర్‌కు బదిలీ చేయడంతో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. జనార్దన్‌రెడ్డి, సంగారెడ్డిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని