logo

Hyderabad: బతకాలని ఉన్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా

జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు చనిపోవాలని లేదు.. అయినా ధైర్యం కూడగట్టుకుని బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు అందరినీ కలిచివేశాయి.

Updated : 01 Jul 2024 10:12 IST

రమేష్‌

జవహర్‌నగర్‌: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు చనిపోవాలని లేదు.. అయినా ధైర్యం కూడగట్టుకుని బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు అందరినీ కలిచివేశాయి. ఈ ఘటన జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని బాలాజీనగర్‌ ఆనంద్‌నగర్‌ కాలనీలో ఆదివారం జరిగింది. మృతుడి సోదరుడు, పోలీసుల వివరాల మేరకు.. జిమ్‌ కోచ్‌గా పనిచేస్తున్న రమేష్‌(43) తొమ్మిదేళ్లుగా సోదరుడు ఆనంద్, తండ్రితో కలిసి బాలాజీనగర్‌లో నివసిస్తున్నాడు. భార్య విడాకులు ఇవ్వడం, కుమార్తె దూరం కావడంతో మనోవేదనకు గురయ్యాడు.ఆదివారం సోదరుడు  బయటికి వెళ్లగా కింద గదిలో ఉన్న రమేష్‌ పడకగదిలో ఉరి వేసుకున్నాడు.  కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు