logo

వీఆర్‌కు తుళ్లూరు సీఐ

రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు స్టేషన్‌కు గత నెల 27న సీఐగా నియామకమైన మాతంగి శ్రీనివాసరావును వీఆర్‌కు పంపుతూ పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Published : 04 Jul 2024 04:35 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు స్టేషన్‌కు గత నెల 27న సీఐగా నియామకమైన మాతంగి శ్రీనివాసరావును వీఆర్‌కు పంపుతూ పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా కొండెపి సీఐగా పని చేసిన సమయంలో అక్కడి తెదేపా కార్యకర్తలు, నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అప్పట్లో కొండెపి తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైకాపా నాయకులతో అంటకాగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను వీఆర్‌కు పంపి...తుళ్లూరు సీఐ-2గా పనిచేస్తున్న అనురాధకు స్టేషన్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని