logo

ఇంటర్‌ విద్యార్థినులకు మినీ వాహనం వితరణ

వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్‌చౌదరి కొర్నెపాడు గ్రామంలోని జడ్పీ స్కూల్‌ ఇంటర్‌ విద్యార్థినుల సౌకర్యార్థం రూ.8 లక్షల విలువైన మినీ వాహనాన్ని (టాటా మ్యాజిక్‌) ఆయన తల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి జ్ఞాపకార్థం వితరణగా ఇచ్చారు.

Published : 04 Jul 2024 04:21 IST

కొర్నెపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్‌చౌదరి కొర్నెపాడు గ్రామంలోని జడ్పీ స్కూల్‌ ఇంటర్‌ విద్యార్థినుల సౌకర్యార్థం రూ.8 లక్షల విలువైన మినీ వాహనాన్ని (టాటా మ్యాజిక్‌) ఆయన తల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి జ్ఞాపకార్థం వితరణగా ఇచ్చారు. ఇక్కడ ఇంటర్‌ చదివే విద్యార్థినులు పుల్లడిగుంట గ్రామం నుంచి పాఠశాలకు వచ్చేందుకు దీన్ని వినియోగించనున్నారు. ఆ వాహనం నిర్వహణకు రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, తెదేపా మండలాధ్యక్షుడు మన్నవ పూర్ణచంద్రరావు, వ్యాపారవేత్త నేరెళ్ల తిరుపతిరావులు రూ.1.50 లక్షలు సమకూర్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు రామ్‌చౌదరి తండ్రి చినరాములును సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు ఇదే పాఠశాలలో చదువుకున్నాడని, ఆ సమయంలో కాలినడకన వెళ్లే వాడని, తనలాగా ఎవరూ కష్టపడకూడదనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని సమకూర్చినట్లు చెప్పారు. ఉప్పుటూరి చినరాములు సేవా ట్రస్ట్‌ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. తొలుత గ్రామస్థులు, విద్యార్థులు పూలు చల్లుతూ దాతలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఆడిటోరియం నిర్మాణానికి దాతలు శంకుస్థాపన చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని