logo

అమరావతి దిగ్విజయంగా వెలుగొందాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించేలా అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటుందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 04 Jul 2024 04:07 IST

మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల పయనమైన రాజధాని రైతులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించేలా అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటుందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు బుధవారం ఉదయం తుళ్లూరు నుంచి రాజధాని రైతులు బస్సులు, కారుల్లో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఏకైక రాజధానిగా అమరావతిని కాపాడుకోవడానికి అన్నదాతలు 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమం చేసి విజయం సాధించారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో గతంలో తుళ్లూరు నుంచి తిరుమలకు మహాపాదయాత్ర చేశారు. అమరావతి ఉద్యమం విజయం సాధించడం, అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తిరుమల పయనమయ్యారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి రైతులు వెళుతున్న బస్సులను ప్రారంభించారు. తొలుత ఇక్కడి శివాలయంలో పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. గురువారం ఉదయం అలిపిరి చేరుకొని కాలినడకన మొక్కులు చెల్లించుకుంటామని అన్నదాతలు తెలిపారు. ప్రయాణానికి అయ్యే ఖర్చులను రైతు ఉప్పలపాటి సాంబశివరావు సమకూర్చారు. రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు, నాయకులు గౌర్నేని స్వరాజ్యరావు, జమ్ముల శ్యాంకిషోర్, కాటా అప్పారావు, ధనేకుల వెంకట సుబ్బారావు, పువ్వాడ సురేంద్ర, రాంబాబు, అనిల్‌ పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని